NTV Telugu Site icon

Earthquake in Suryapet: సూర్యాపేట జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం

Earthquake In Suryapet District

Earthquake In Suryapet District

Earthquake in Suryapet district: సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. సుమారు 10 సెకన్ల భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. గతంలో కూడా ఇలాంటి భూకంపం వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని ప్రాంతాల్లో భూప్రకంపనాలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంతో పాటు ప్రాజెక్టు సమీపంలోని గ్రామాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ప్రాజెక్టు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భూప్రకంపనలు వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు సమీపంలోని రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read also: Taraka Ratna: తండ్రిని చూసి వెక్కి వెక్కి ఏడ్చిన కూతురు.. కన్నీధారను ఓదార్చేవారెవరు

ఇక తాజాగా నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. దీంతో..ఇంటిలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. తెల్లవారుజామున భూమి కంపించడంతో అందరూ గాఢ నిద్రలో వున్నారు. భూమినుంచి శబ్దాలు రావడంతో భయాందోళలనతో ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. అందరూ రోడ్డుమీద ఉండి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

Read also: Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు నమోదవుతున్నాయి. భూకంపాలు ఎందుకు నమోదవుతున్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. 2022 డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్‌లో భూకంపం సంభవించింది. పెద్ద శబ్ధంతో భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్టోబర్ 2, 2021న రామగుండం, మంచిర్యాల మరియు కరీంనగర్‌లో భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత 4.0. 2022 అక్టోబర్ 15న ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం సంభవించింది. 1 నవంబర్ 2021 న, తెలంగాణ రాష్ట్రంలోని కుమురంభీం జిల్లా మరియు మంచిర్యాల జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఏడాది నవంబర్ 29న ఢిల్లీలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Taraka Ratna Tatoo: తార‌క‌ర‌త్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం