Durga Idol Blindfolded: తెలంగాణ ఆస్థిత్వం ప్రపంచంలోనే ప్రత్యేకతను చోటు సంపాదించుకున్న ప్రకృతి పర్వసించే పండుగ పూల పండుగ బతుకమ్మ ను పురస్కరించుకొని అంతర్జాతీయ బతుకమ్మను ప్రముఖ శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ మేడ్చల్ జల్లా కుషాయిగూడలో కండ్లకు గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహాన్ని రూపొందించాడు. తెలంగాణ సంప్రదాయాలను ఆడపడుచులు, బతుకమ్మ ఆటపాటలతో తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులతో, రంగరంగుల పువ్వులు రామనీయంగా అలంకరించి, దుర్గామాత ఆదిశక్తి పరాశక్తి తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాల్లో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంది. బతుకమ్మ పండుగతో యావత్ ప్రపంచం అంతా సంబర పడుతుంది, అమ్మవారి దయ, కరుణ చూపు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ శిల్ప కళాకారుడు ఓతి బస్వరాజ్ బతుకమ్మ ఫెస్టివల్ సందర్బంగా కండ్లకు గంతలు కట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం అందరిని అబ్బురపర్చింది.
Andhra Pradesh : ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీ.. సీటు దొరకక మగవాళ్లు ఇబ్బంది