Drugs Busted: అత్తాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs Busted: హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో నిర్వహించిన మెరుపు దాడుల్లో 8 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు భారీ మొత్తంలో మెఫెంటెర్మిన్ సల్ఫేట్ (Mephentermine Sulphate) ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌తో పాటు ముజాహిద్‌ను అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.
డ్రగ్స్ విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ బృందం అత్తాపూర్‌లోని జలాల్ బాబా నగర్లో ఉన్న అబ్దుల్ హసన్ నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇంట్లో దాచి ఉంచిన MDMA డ్రగ్స్ తోపాటు భారీ సంఖ్యలో ఇంజెక్షన్లు లభించాయి. ప్రాథమిక విచారణలో అబ్దుల్ హసన్ బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే గుజరాత్ నుంచి ఇంజెక్షన్లు తెప్పించి, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వాటిని నగరంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Also Read
శరీర దారుఢ్యం పెంచుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులు ఈ ఇంజెక్షన్లను వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి ఇంజెక్షన్ల విక్రయం చట్టవిరుద్ధమని, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ హసన్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దారి దోపిడీ, హత్య, రౌడీషీటర్ కేసులతో పాటు ఇటీవల పాతబస్తీలో జరిగిన హత్య కేసులో కూడా అతడు ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.
అబ్దుల్ హసన్, ముజాహిద్ వద్ద నుంచి MDMA డ్రగ్స్, భారీ సంఖ్యలో ఇంజెక్షన్లతో పాటు పలు ప్రాణాంతక ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు.. ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక మరెవరు ఉన్నారు.? సరఫరా వ్యవస్థ ఎలా సాగుతోంది అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Drugs Busted: అత్తాపూర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. MDMAతో పాటు భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం.!
-
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
-
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
Prabhas : షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!