Drug Case : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు.. నవదీప్‌కు నోటీసులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు పట్టుబడటంతో మరోసారి తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. టాలీవుడ్ దర్శకుడి అరెస్ట్‌తో.. టాలీవుడ్ లింకులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎనిమిది మంది అరెస్టు చేశారు పోలీసులు. వారిలో ముగ్గురు నైజీరియన్లతో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. ఎనిమిది మందిని ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్ లు, సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచంద్, దేవరకొండ సురేశ్‌రావు, ఖమ్మం సాఫ్ట్వేర్ ఉద్యోగి సందీప్ లతో పాటు శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది.
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
వీరిని మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరుచనున్నారు. అయితే.. మరో ఎనిమిద మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, బిస్త్రా, టెర్రా కేఫ్ ఓనర్ అర్జున్, విశాఖపట్నం వాసి కలహర్ రెడ్డి లతో పాటు మరో ఐదుగురు, డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న మరో ముగ్గురు నైజీరియన్లు పరారీ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. అయితే.. నటుడు నవదీప్ అందుబాటులో లేడని పోలీసులు చెబుతుంటే, తాను ఎక్కడికి వెళ్ళలేదని, తనను పోలీసులు అప్రోచ్ కూడా కాలేదని చెబుతున్నారు హీరో నవదీప్.
Also Read : Devil Controversy: వినాశకాలే విపరీత బుద్ధి.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
అయితే.. ఈ క్రమంలోనే హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించిన పోలీసులు.. నిన్న పోలీసులకు అందుబాటులోకి నవదీప్.. ఇంకా షాడో సినిమా ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి పరారీలో ఉన్నారు. పలు పబ్ ల పైనా నార్కోటిక్ పోలీసుల నిఘా పెట్టారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. కేపీ చౌదరి లిస్ట్ లోనూ మోడల్ శ్వేతా పేరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేట కొనసాగుతోంది. కేపీ చౌదరి లిస్ట్ తో పాటు గతంలో బెంగుళూరు డ్రగ్స్ కేస్ లోనూ కలహర్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!