Devil Controversy: వినాశకాలే విపరీత బుద్ధి.. డైరెక్టర్ పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devil Controversy: ప్రతి ఒక్క డైరెక్టర్.. తమ సినిమా గురించి చెప్పాలంటే.. అది తన బిడ్డతో సమానం అని.. ఎన్నో ఏళ్ళు ఆ సినిమాను కష్టపడి, ఇష్టపడి చేసినట్లు చెప్పుకొస్తాడు. అయితే తన బిడ్డలాంటి సినిమా నుంచి తనను తీసేస్తే.. ఆ డైరెక్టర్ పడే బాధ అంతా ఇంతాకాదు. సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక సినిమాకు చాలామంది టెక్నీషియన్స్ మారుతూ ఉంటారు. కానీ, సినిమా మొత్తం పూర్తీ అయ్యాకా ఏ నిర్మాత.. డైరెక్టర్ ను మార్చాలనుకోడు. కానీ, నిర్మాత అభిషేక్ నామా ఆ పని చేశాడు. దాదాపు మూడేళ్లు కష్టపడి సినిమా తీసిన డైరెక్టర్ నవీన్ మేడారం పేరును.. సినిమా నుంచి తొలగించి అతనికి అన్యాయం చేశాడు. అసలు వివాదం ఏంటి అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం డెవిల్. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Ramanna Youth Review: రామన్న యూత్ రివ్యూ
Also Read
ఇక నవంబర్ 24 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పోస్టర్ లో డైరెక్టర్ నవీన్ పేరును తొలగించి అభిషేక్ నామా పేరును వేసుకున్నాడు. మొదట్లో.. నవీన్ కు కోటి రూపాయలు అగ్రిమెంట్ రాయకుండా ఇచ్చాడు. ఇక సినిమా మధ్యలో డైరెక్టర్ – నిర్మాత మధ్య విబేధాలు రావడంతో ఆ డబ్బులో సగం ఇవ్వాలని అభిషేక్ వేధించడం మొదలుపెట్టాడు. ఇక అది ఇవ్వడం కుదరదు అని చెప్పడంతోనే అభిషేక్ ఈ విధంగా చేశాడని తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై డైరెక్టర్ నవీన్ ఒక పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వినాశకాలే విపరీత బుద్ధి.. బ్లాక్ ఫోటో పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
-
Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!