Revenue Intelligence: డ్రగ్స్ మాఫియాపై చెక్ పెడుతున్నారు అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్ సరఫరాకు డ్రగ్ డీలర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలో అధికారులు అలర్ట్ అయ్యారు. నగర శివారు ప్రాంతాల్లో డంప్ చేసి డ్రగ్ మాఫియా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా గుర్తించి అధికారులు సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. తనిఖీలు ఎక్కువ అవుతుండడంతో డ్రగ్ మాఫియా ఏకంగా డ్రగ్స్ తయారీ ల్యాబ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో.. నగర శివారు ప్రాంతాల్లోని ల్యాబ్ ల పేరుతో లోపల డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఈనెల 21 నుండి ఆపరేషన్ మొదలుపెట్టింది.
Read also: Namaz Controversy: క్యాంపస్‌లో నమాజ్ చదివిన విద్యార్థులు.. రాజుకున్న వివాదం
పలు పార్టీల దగ్గర నుండి ఆర్డర్లు తీసుకున్న డ్రగ్ మాఫియాలను ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ లను సీజ్ చేస్తున్నారు. నిన్న ఏకంగా 50 కోట్ల డ్రగ్స్ ను డి.ఆర్.ఐ.అధికారులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సిద్దం చేసుకున్న డ్రగ్స్ ని డ్రగ్స్ డీలర్స్ నగర శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంగిచెర్ల ఉప్పల్ లో 50 కోట్ల విలువ చేసే 24 కేజీల మెఫి డ్రిన్ డ్రగ్స్ ని DRI అధికారులు పట్టుకున్నారు. చర్లపల్లి, బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లో రెండు ల్యాబ్ లలో ఈ డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఏడుగురిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మెఫీ డ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలను తీసుకువచ్చి ఈ ల్యాబ్లో డ్రగ్ గా తయారుచేసి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
డ్రగ్స్ తయారీలో కీలక సూత్రధారి, ఫైనాన్షియర్ రూ.60 లక్షల నగదుతో నేపాల్‌కు పారిపోతుండగా గోరఖ్‌పూర్‌లో అరెస్టు చేశారు. అరెస్టయిన ఏడుగురు నిందితులు గతంలో కూడా డ్రగ్స్ తయారీ కేసుల్లో డీఆర్‌ఐకి పట్టుబడ్డారు. ఈ కేసులో కీలక సూత్రధారి హైదరాబాద్‌లో జరిగిన హత్య కేసులో నిందితుడు, వడోదరలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు. ఇండోర్ తదితర ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ కేసులో పట్టుబడి జైలు కెళ్లాడు.ఇండోర్ జైలు నుంచి తప్పించుకుని మళ్లీ డ్రగ్స్ తయారు చేస్తున్నాడని అధికారులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఫైనాన్షియర్ ను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Waltair Veerayya: ఈ మూవీ చిరుకి ‘విక్రమ్’ అవుతుందా?