నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి.
Read Also: సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉచిత వాహన సేవలు: టీఎస్ఆర్టీసీ
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకుని సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు కార్పొరేట్ అపార్టుమెంట్లను తలదన్నేలా ఆకట్టుకుంటోంది. లిఫ్ట్, గృహాలకు నిరంతర విద్యుత్ నిమిత్తం పవర్ బ్యాకప్ కోసం ప్రత్యేక జనరేటర్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 54వేల స్క్వేర్ ఫీట్ గల మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లలో 118 షాపులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!