Site icon NTV Telugu

నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు

ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి.

Read Also: సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉచిత వాహన సేవలు: టీఎస్ఆర్టీసీ

ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకుని సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు కార్పొరేట్ అపార్టుమెంట్లను తలదన్నేలా ఆకట్టుకుంటోంది. లిఫ్ట్, గృహాలకు నిరంతర విద్యుత్ నిమిత్తం పవర్ బ్యాకప్ కోసం ప్రత్యేక జనరేటర్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 54వేల స్క్వేర్ ఫీట్ గల మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లలో 118 షాపులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version