Revanth Reddy: TRS పై నేను వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు BRSగా పేరు మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు. కేంద్రం నుండి వస్తున్న మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు అరాచక పార్టీలుగా మారాయని అన్నారు. ఒకరు ఓటుకు 30వేలు.. ఇంకొకడు 40 వేలు ఇస్తా అంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశం అంతా నాదే అంటాడు.. మునుగోడులో ఒక గ్రామానికి పరిమితం అయ్యాడు అంటూ ఎద్దేవ చేశారు. KCR చిత్ర విచిత్ర పనులు మాటలు ఆయనకు అలవాటే అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
Trs పై నేను వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు brs గా పేరు మారదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టుకు వెళ్తున్నాము.. ఒకటి రెండు రోజుల్లో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ..trs కి మధ్య మిత్ర భేదమే.. శత్రు భేదం కాదని రేవంత్ తెలిపారు. విక్రమార్కుడు అనే సినిమాలో బ్రహ్మానందం రవితేజ లు గుండ్లు కొట్టి డబ్బులు పంచుకునే పంచాయతి లెక్క ఉంది trs,బీజేపీ పంచాయతీ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకమ్ ట్యాక్స్ నిర్మలా సీతారామన్ పరిదిలోనిది మరి Trs గులాబీ చెందల విషయం ఎందుకు తేల్చడం లేదు? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ కి లక్షల్లో చెందా ఇస్తే మా నాయకులకు ed నోటీసులు ఇచ్చింది. వందల కోట్లు వసూలు చేసిన trs కి ఎందుకు నోటీసులు ఇవ్వదు? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే trs, బీజేపీ మైత్రి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Puneeth Rajkumar’s Last Film: పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమాపై ప్రధాని మోదీ ట్వీట్.. అప్పు భార్య రిప్లే ఇదే..