Telangana Free Bus: ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Free Bus: మహిళా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ షాక్ ఇచ్చింది. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం” వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చిచెప్పింది. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ స్కీంకు వర్తిస్తుందని తెలిపారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందునా అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని క్లారిటీ ఇచ్చారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా.. ఇప్పటికి కొంత మంది స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్స్ లు చూపిస్తున్నారని #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని మండిపడ్డారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు.
Read also: Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్?
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నామని సూచించారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని తెలిపారు. ‘ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం’ అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇది సరికాదని హెచ్చరించారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును #TSRTC కి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని అన్నారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని అన్నారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలని తెలిపారు. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్ లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని గుర్తు చేశారు. అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నామని సూచించారు.
Ratan Tata : ఒక్క సెకనులో రూ.6600 కోట్లు రాబట్టిన రతన్ టాటా కంపెనీ
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!