NTV Telugu Site icon

Doctors Dutymind: అడవిలో నడిచి.. ఆదివాసీలకు వైద్యం అందించి…

Doctor

Doctor

డాక్టర్లంటే టిప్ టాప్ గా తయారై ఆస్పత్రికి వచ్చి రోగుల్ని చూసేసి తమ టైం కాగానే అక్కడినించి వెళ్ళిపోతారు. డాక్టర్లంటే దేవుళ్లతో సమానం. వైద్యో నారాయణో హరి అంటారు. అంటే దేవుడు ప్రాణం పోస్తే.. ఆ ప్రాణాన్ని నిలిపేవాడు డాక్టర్. గిరిజన ప్రాంతాల్లో, కొండ కోనల్లో వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే కొండ ప్రాంతాలకు వెళ్లాలంటే నడవాల్సిందే.. అది వాగులు వంకలు బురదమయం దాటుతూ రాళ్లదారిలో నరక యాతనతో నడక సాగాల్సిందే.. అటువంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది అడవి బాట పట్టారు.

Read Also: Ananya Panday: అతనికి బ్రేకప్ చెప్పి.. మరో స్టార్ హీరోతో ఎఫైర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని మారుమూల గిరిజన పల్లె పెద్దమిద్దిలో వినాయకపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ రాందాస్ నేతృత్వంలో వైద్య బృందం మొద్దులమడ గ్రామం నుండి దట్టమైన అటవీ ప్రాంతం గుండా కొంత దూరం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఆ తర్వాత ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పెద్దమీది చేరుకొని వైద్య సేవలు అందించారు. దోమల నివారణ సీజనల్ వ్యాధులపై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు.

22 ఇళ్లల్లో దోమల నివారణ మందు సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పిచికారి చేసి 44 దోమల తెరలను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో 52 మందికి పరీక్షించి చిరు వ్యాధులకు చికిత్స అందించారు. ఇద్దరు జ్వరం పీడితులను గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. నడిచి వెళ్లడానికి కూడా వీలులేని అటవీ మార్గంలో మందులు, వైద్య పరికరాలు మోస్తూ వెళ్లి వైద్య సేవలు అందించిన వినాయకపురం PHC బృందం కృత నిశ్చయం ప్రశంసనీయం.. అరణ్యంలో నాటు వైద్యమే శరణ్యంగా జీవించే వారి వద్దకు ప్రభుత్వ సేవలు తీసుకెళ్లిన వారి ప్రయాస అభినందనీయం. అడవిలో నడిచి వైద్య సేవలు అందించిన వైద్యుల్ని, సిబ్బందిని అంతా ప్రశంసిస్తున్నారు. డాక్టర్లంటే ఇలా వుండాలంటున్నారు జనం.

Read ALso: Amaravathi: అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఏడేళ్లు.. ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు