Site icon NTV Telugu

YS Sharmila: కేసీఆర్ ను న‌మ్మి మ‌ళ్ళీ మోస‌పోవ‌ద్దు

Sharmila

Sharmila

ప్ర‌జా ప్ర‌స్థాన యాత్ర‌లో భాగంగా వేయి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుని ప్ర‌తిక్ష‌ణం, ప్ర‌తిరోజు రైతుకోసం చేస్తున్న రైతుగోస ధ‌ర్నాలో పాల్పంచుకున్న అంద‌రికి ధ‌న్యావాదాలు తెలిపారు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో పాల్గొన్నషర్మిల సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు. రైతు వ‌రి వేయ‌డం ఉరిగా మారింద‌ని అన్నారు. కేసీఆర్ ఊస‌ర వెళ్ళిలా మాట‌లు మార్చారు,ఎన్ని వాగ్దానాలు చేశారు ఒక్క మాటైన నిల‌బెట్టుకున్నాడా అని ప్ర‌శ్నించారు. ఒక సారి స‌న్న‌బియ్యం అంటాడు.. మ‌రొక సారి దొడ్డు బియ్యం అంటాడు. త‌రువాత కొన‌కుండా మోసం చేస్తాడు.. వ‌రి వ‌స్తే ఉరే అంటాడు.. ఢిల్లీకి వెళ్లి నాట‌కాలు చేసి మ‌ళ్ళీ నేను కొంటానంటాడు ఒక్క మాట‌మీద కేసీఆర్ నిల‌బ‌డ్డాడా అంటూ నిల‌దీశారు.

వ‌రివేస్తే ఉరి అని బెదిరించిన ముఖ్య‌మంత్రి మ‌న‌కొద్దని ఎద్దేవ చేశారు. మ‌ద్ద‌తు ధ‌ర అంటే ఏమిటి? అని ప్ర‌శ్నించారు. వ‌రి మ‌ద్ద‌తు ధ‌ర 19 వంద‌ల 60 రూపాల‌యితే.. ఆ..ధ‌ర ఎంత‌మందికి వ‌చ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంచేయాలో తెలియ‌ని రైత‌న్న‌లు 15 వంద‌ల‌కు అమ్ముకోవాల్సి వ‌చ్చింద‌ని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు, 5 ప‌ద‌వులు.. మ‌న బిడ్డ‌లు మాత్రం హ‌మాలీ ప‌ని చేసుకోవాలా అంటూ మండి ప‌డ్డారు. ఇదేనా న్యాయం అంటే అని ష‌ర్మిళ అన్నారు.

Tollywood: సీనియర్ డైరెక్టర్ కు సతి వియోగం!

Exit mobile version