DK Aruna: వంశీ చంద్ రెడ్డికి అది అలవాటే.. రాముడిపై ప్రమాణానికి నేను రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: కాంగ్రెస్ ఎఐసిసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి సవాలును డికె అరుణ స్వీకరించారు. నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో డికెఅరుణ పై వంశీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా పోటీచేయడానికి డికె అరుణ 15 కోట్లు డిమాండ్ చేసిందని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. డికె అరుణ శ్రీరాముడిపై ప్రమాణం చేసి నిజం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. డికె అరుణ రాముడి పై ప్రమాణం చేస్తే తను రాజకీయ సన్యాసం చేస్తానన్న వంశీ చంద్ రెడ్డి చెప్పడంతో వైరల్ గా మారింది. వంశీ చందర్ రెడ్డి సవాలును డీకే అరుణ స్వీకరించారు.
రాముడిపై ప్రమాణానానికి తాను సిద్దమేనన్న డికెఅరుణ ప్రకటించారు. వంశీచంద్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండి పడ్డారు. తాను జిల్లాలో ఎవరూ గుర్తు పట్టడంలేదని అన్నారు. డి కె అరుణ గూర్చి మాట్లాడితే తనకు గుర్తింపు వస్తుందని వంశీ చంద్ రెడ్డి ఆరాటమన్నారు. సమయం, స్థలం మీరు చెప్పినా సరే లేదంటే నేనే టైం డేట్ ఫిక్స్ చేస్తా అంటూ డికే అరుణ తెలిపారు. నీతో పాటు ఎవరెవరిని తీసుకువస్తావో రా అని సవాల్ చేశారు. తనకు మొదటి నుండి రాజకీయ సన్యాసం అలవాటే అంటూ సెటైర్ వేశారు. నీతో పాటు నీవు చెప్పిన వారిని కూడా రాజకీయ సన్యాసానికి సిద్దం చేయి అంటూ డికె అరుణ అన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
Read also: Madras High Court Judge: నాకు హింది రాదు.. వాటిని అలాగే పిలుస్తాను..
డీకే అరుణ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీపీసీసీ నేతల సమక్షంలో రూ. 15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమన్నది నిజం కాదని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి అన్నారు. రాముడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేట్ వేదికగా నియోజకవర్గ కార్యకర్తల భారీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీచందర్‌రెడ్డి మాట్లాడుతూ గత లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నాయకులు పార్టీని వీడి ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేశారన్నారు. కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని, వారి పనితీరును స్వయంగా చూశానన్నారు. ఇక్కడి ఎంపీతో పాటు రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించాలన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!