మహాబూబ్ నగర్ జిల్లా: ముఖ్యమంత్రి కేసిఆర్ పై బిజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టులపై కేసిఆర్ కు చిత్తశుద్దిలేదని… ఆర్డిఎస్ పై ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రముఖ్యమంత్రి జగన్ ల మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ఆర్డిఎస్ నుండి ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కేసిఆర్ కు సోయిలేదని.. తెలంగాణ వచ్చినాంక ఉమ్మడి పాలమూరుకు ఒరిగిందేమిలేదని పేర్కొన్నారు.
read also: కొత్త కాంతులతో యదాద్రి ఆలయం..
ఆర్డిఎస్ వద్ద కుర్చి వేసుకొని కూర్చుంటానన్న కేసిఆర్ యాడికి పోయాడని ప్రశ్నించారు డీకే అరుణ. హుజురాబాద్ ఉపన్నికల కోసమే ఫాంహౌజ్ నుండి లేచి జిల్లాల పర్యటన చేస్తున్న కేసిఆర్… టిఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు చేసినా హుజురాబాద్ లో బిజేపి పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తెలిపారు. 2023 లో తెలంగాణ బీజేపీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు.