DK Aruna: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక బోగస్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక ప్రారంభించి మహబూబ్ నాగర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంచనాలు పెంచి లక్షల కోట్లు దంచుకోవడానికి ప్రాజెక్ట్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కానీ ప్రాజెక్ట్ ను ప్రారంభించేందుకు నీకు సిగ్గు అనిపించడం లేదా కెసిఆర్? అని ప్రశ్నించారు. తెలంగాణలో విప్లవం ప్రారంభం అయింది మిస్టర్ కేసీఆర్ అని అరుణ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించారని మండిపడ్డారు. సెంటిమెంట్ తో కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని ఆరోపించారు. 12వందల మంది ఉసురుపోసుకొని కేసీఆర్ గద్దెనెక్కారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న కేసీఆర్.. నిరుద్యోగులుగానే ఉంచారని మండిపడ్డారు. నిరుద్యోగ ఆశలను కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు. ఇప్పటి వరకు డిఎస్సీ వేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని గుర్తు చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధి పొందేందుకు అనేక ప్రకటనలు ఇస్తున్నారని అన్నారు. ప్రకటనల పేరుతో పాలాభిషేకాలు చేయించుకోవడానికి కేసీఆర్ కు సిగ్గు ఉండాలని అన్నారు. తెలంగాణ ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తావు కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడికి పోయాయి కేసీఆర్? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అని అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మీకు సిగ్గు లేదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విప్లవం మొదలైంది కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో మార్పు జరగాలి.. అదే బీజేపీ తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.
Cheating boyfriend: ప్రేమించి మోసపోయింది.. చివరకు ప్రాణం తీసుకుంది
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!