NTV Telugu Site icon

ఈటల గెలుపు తథ్యం : డీకే అరుణ

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. రోజురోజుకు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో జోరు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊరూరా ఈటల రాజేందర్‌ కు ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఈటల గెలుపు తథ్యమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, హుజురాబాద్‌లో భారీ మెజార్టీతో ఈటల రాజేందర్‌ గెలుస్తారన్నారు.

సర్వేలలో టీఆర్‌ఎస్‌పై ఉన్న విముఖత బయటపడిందని, అందుకే కేటీఆర్‌ ఈటల, రేవంత్‌ రెడ్డిల మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయంటూ నిందలు వేస్తున్నాయని అమె అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చూపిస్తూ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనకు హుజురాబాద్ ఉప ఎన్నికతో పతనం మొదలైందని ఆమె ఉద్ఘాటించారు.