NTV Telugu Site icon

DK Aruna: బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి

Dk Aruna

Dk Aruna

DK Aruna Fires On BRS Govt For Arresting Bandi Sanjay and Etela Rajender: బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గన్‌పార్క్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. తమ నాయకులతో పోలీసులు వ్యవహరించిన తీరు దౌర్భాగ్యమని మండిపడ్డారు. మహిళా నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు. మేము నిరసన తెలపొద్దు కానీ.. మీరు, మీ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణలో, దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చా? అని నిలదీశారు.

Jagga Reddy: గ్రూప్-1 పరీక్షలు వెంటనే రద్దు చేయాలి.. ఇదో పెద్ద స్కామ్

కాగా.. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై బండి సంజయ్ గన్‌పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఈటల కూడా పాల్గొన్నారు. ఈ లీకేజ్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్తున్నట్టు బండి సంజయ్ ప్రకటించడంతో.. పోలీసులు గన్ పార్క్‌ను చుట్టుముట్టారు. అలాగే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే మైక్ కట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వైపు వెళ్లకుండా బండి సంజయ్, ఈటలను అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరికి రక్షణగా కార్యకర్తలు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో పెనుగులాట చోటు చేసుకుంది. గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బండి సంజయ్, ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ని ఖండిస్తూ బీజేపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే అరుణ పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా