DK Aruna : అధికార మదంతో పేదల కడుపుకొడితే పుట్టగతులు ఉండవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ 8 ఏళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. చిత్తశద్ధి ఉంటే అర్హులైన భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి మూడు సంవత్సరాలలో గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని సవాల్‌విసిరారు.
గద్వాల నుంచి ఎర్రవల్లి వరకు ప్రభుత్వ భూమి ఉండగా 45 ఏకరాల స్థలాన్ని నిరుపేదలకు కేటాయించిన భూమిని హాస్పిటల్ కు, నర్సింగ్ కాలేజీకి కేటాయించడం శోచనీయమన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించాలని ఆమె వ్యాఖ్యానించారు. అధికార మదంతో పేదప్రజల కడుపుకొడితే పుట్టగతులు ఉండవని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా ఆమె.. రైతుల పాలిట ధరణి శాపంలా మారిందన్నారు.
Also Read
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
తాజావార్తలు
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
-
Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?