Site icon NTV Telugu

Agnipath Scheme: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే..! డీకే అరుణ సంచలన ఆరోపణ

Dk78

Dk78

సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన ఘటనకు టీఆర్ఎస్ రాజకీయ వ్యూహకర్త అని చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉండచ్చని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుమానం వ్యక్తం చేసారు. నిన్నటి ఘటన పై మాట్లాడిన డికె అరుణ, నిన్న జరిగిన ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామని డీకే అరుణ అన్నారు. శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? అని ప్రశ్నించారు. నిఘా విభాగం ఏమి చేస్తున్నట్లు, రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? నిలదీశారు.
నిన్న జరిగిన ఘటన ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని డీకే అరుణ ఆరోపించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేటు అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసుల విచారణంలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిల్‌లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు.

Shamshabad: ఎయిర్ పోర్ట్ కు ప్రతిష్టాత్మక అవార్ధు

Exit mobile version