ప్రధాని మోడీ జులై 3వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే మోడీకి తెలంగాణ బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అయితే ఇప్పుడు రికార్డు స్థాయిలో జనసమీకరణ చేసి ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ శ్రేణులు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో బీజేపీ జాతీయ ఉపధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… జులై 3వ తేదీన హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ నుంచి 35 మందికి తగ్గకుండా సభకు తరలి రావాలని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మొత్తం కాషాయమయం కావాలని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని, తెలంగాణలో రాబోటేది బీజేపీ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కష్ట పడాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.