NTV Telugu Site icon

Telangana Assembly: శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ.. నేటి నుంచి 3 రోజుల పాటు

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: బడ్జెట్ కేటాయింపులపై నేటి నుంచి శాసనసభలో చర్చ జరగనుంది. మూడు రోజుల పాటు బడ్జెట్ అంశాలపై చర్చ జరగనుంది. తొలిరోజు సంక్షేమం, రోడ్లు-భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌరసరఫరాలు, పర్యాటకం, క్రీడా శాఖలకు సంబంధించి మొత్తం 12 అంశాలపై చర్చ జరగనుంది. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎస్ ఆర్ డీపీ, గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, కల్యాణలక్ష్మి పథకం, ఎకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదికలో రాష్ట్రానికి పెట్టుబడులు, మైనింగ్ రెవెన్యూ, సబర్బన్ బస్సులను ప్రస్తావిస్తారు. మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. అప్పుడు మంత్రి హరీశ్ రావు సమాధానం చెబుతారు. దీంతో మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దయింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి.

Read also: Minister KTR: బైక్‌ ఎక్కిన మంత్రి కేటీఆర్‌.. గర్వంగా ఉందంటూ ట్విట్

నేటి నుంచి 3 రోజుల పాటు పన్నులపై చర్చ జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరగనుంది. 12వ తేదీ ఆదివారం నాడు ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. సభ దానిని ఆమోదిస్తుంది. దీంతో సభ ముగుస్తుంది. ఈఏడాది బడ్జెట్‌ సమావేశాలు మార్చిలో ఉంటాయని అందరూ భావించినా కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 3న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో సాధారణంగా ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అప్పటికి బడ్జెట్‌ ఆమెదం పొందితే మరుసటి రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైబడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. ఈనేపథ్యంలో అన్ని రాష్ట్రాలు మార్చిలోనే బడ్జెట్‌ ఆమెద ప్రక్రియను చేపడతాయి. తెలంగాణలో మొదట్లో అదే ఆనవాయితీ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలోనే ఈప్రక్రియ ముగుస్తోంది. బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక^47 రోజుల పాటు పాత బడ్జెట్‌ అమల్లోనే ఉంటుంది. కాగా.. ఇంత త్వారగా బడ్జెట్‌ సమావేశాల ముగింపుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Students Protest: రాజేంద్రనగర్ ఉద్యాన కాలేజ్‌లో విద్యార్థులు ఆందోళన.. ఉద్రిక్తత