NTV Telugu Site icon

D. Sridhar Babu: తెలంగాణ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు.. జులై నుంచి పంపిణీ..!

Sridharbabu

Sridharbabu

D.Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేస్తామని ఐటీ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ప్రత్యేక నంబర్‌తో అందనుంది. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వేదిక్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడి ప్రజలు గర్వపడేలా కృషి చేస్తానన్నారు. ఆధార్ నంబర్ ఆధారంగా ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డ్ వంటి హెల్త్ ప్రొఫైల్ నంబర్ ఇవ్వబడుతుందని తెలిపారు.

Read also: Rishi Sunak : మూడవ ప్రపంచ యుద్ధం.. అణు పరిశ్రమలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న బ్రిటన్

పేరు నమోదు చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్యసేవల వివరాలు తెలుస్తాయని, ఏ వైద్యుడు సంప్రదించినా వెంటనే ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చికిత్స పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తన తండ్రి శ్రీపాద్‌రావు మరణానంతరం సోనియా గాంధీ తనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. తన తల్లి జయశ్రీ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయాలకు అతీతంగా సేవలు అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించాలంటే ఎంతో ఓపిక ఉండాలి. మంథని ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Gopi Sundar: మళ్ళీ దొరికేశాడు.. ఫ్యామిలీ స్టార్ రెండో పాట అక్కడి నుంచి తస్కరించిందా?