Site icon NTV Telugu

Digital Arrest : డిజిటల్ అరెస్ట్ మాయతో కోట్లకు మోసం.. హైదరాబాద్‌ మహిళకు టోకరా

Cyber

Cyber

Digital Arrest : హైదరాబాద్‌ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజ్‌కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్‌ అకౌంట్లను (ఫేక్‌ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అనేక మందిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, డిజిటల్ అరెస్ట్ అంటూ మహిళను బెదిరించి, ఆమె ఆస్తులు మరియు బంగారం మొత్తం తాకట్టు పెట్టించారు. అనంతరం ఆ మొత్తాన్ని దోచుకుని ఫైనాన్స్‌ సంస్థల ద్వారా నకిలీ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన సైబర్ నేరగాడు గోయల్‌తో కలిసి పనిచేసిన అల్లుడాస్ సుధాకర్‌ను కూడా అరెస్ట్ చేశారు.

దుబాయ్‌కి పారిపోతున్న సమయంలో ముంబై ఎయిర్‌పోర్టులో అల్లుడాస్ సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు రాజ్‌కుమార్‌ కూడా గోయల్‌కు సహకరించినట్టు స్పష్టమైంది. ఈ ఇద్దరూ స్కామ్‌ సూత్రధారులతో సమన్వయం చేస్తూ బాధితురాలిని లక్ష్యంగా చేసుకున్నారు.

సైబర్ క్రైమ్ విభాగం చేపట్టిన దర్యాప్తులో డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెనుక ఉన్న ముఠా తలాలపై స్పష్టత వచ్చింది. ఈ వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Kingdom : హమ్మయ్య కింగ్డమ్ నిర్మాత గట్టిక్కినట్టే.. OTT ఎంత వచ్చిందంటే

Exit mobile version