మనం ఇతర ప్రాంతాలకు, లేదా ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఎయిర్ పోర్టుల్లో జరిగే తతంగం అంతా ఇంతా కాదు. టికెట్ తీసుకోవడం, బోర్డింగ్ పాస్చ తర్వాత డాక్యుమెంట్స్ పట్టుకుని నిలబడాలి. ఇక ఇలాంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పడనుంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రేపటినుంచి డీజీ యాత్ర యాప్ (Digi Yatra) ప్రారంభం కానుంది. టికెట్, బోర్డింగ్ పాస్, డాక్యుమెంట్ పట్టుకుని క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా టెర్మినల్ కు చేరుకునేలా డీజీ యాత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసుతో మహిళలకు ఏం సందేశం ఇస్తున్నారు…?
డీజీ యాత్ర యాప్ లో ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని ఆధారంగా ప్రయాణికులు చెకింగ్ అయ్యే వీలుంటుందని ఎయిర్ పోర్ట్ ఆధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానం డిల్లీ, బెంగళూరు ఎయిర్ పోర్ట్ లలో ఉపయోగిస్తునట్లు తెలిపారు. డీజీ యాత్ర యాప్ ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికులు యాప్ ను తమ సెల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లింక్ చేయాల్సి ఉంటుంది. దాని అధారంగా డాటాబేస్ EKYC నుండి మన ఆధారాలు తీసుకుంటుందని ఆధికారులు తెలిపారు.
ఫేషియల్ రికగ్నిషన్ కోసం ప్రయాణికులు ముందుకా సెల్ఫీ తీసుకోవాలి. ఆ తరువాత డీజీ యాత్ర ఐడీ (Digi Yatra ID)లను విమాన బుకింగ్ నుండి లేదా బోర్డింగ్ లేదా మన బోర్డింగ్ తో లింక్ అవ్వాలి. ఇలా చేస్తే చెక్ పాయింట్ ల నుండి నేరుగా వెళ్లిపోవచ్చు. దీని వల్ల సమయం, శ్రమ కూడా ఆదా అవుతుంది.
Read Also:K Laxman: కీలక పదవి.. ఆ కమిటీలోనూ చోటు
