Dharmapuri Arvind Says Kishan Reddy Is Lucky Hand To BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమ బీజేపీకి లక్కీ హ్యాండ్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొనియాడారు. కిషన్ రెడ్డి ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని, ఆయన్ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2024లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్వింద్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌కు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు గాను జేపీ నడ్డాకు కృతజ్ఞతలు చెప్పారు. ఈటల తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్‌గా వెళ్తారని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ అగ్రెసివ్‌గా తన టర్మ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారని అన్నారు.
Sharad Pawar: ద్రోహం చేసిన వారు నా ఫోటోను ఉపయోగించకూడదు..
తామంతా కలిసి పని చేస్తామని.. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. ఎంపీగా గెలవలేని వ్యక్తి రాహుల్ గాంధీ అని.. ఆయన కూడా తమపై వ్యాఖ్యలు చేస్తాడా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని లేపేందుకు కొన్ని ఛానళ్లు బాగా కష్టపడుతున్నాయని, అయితే మీడియా కథనాలతో ప్రజలను మభ్యపెట్టలేరని కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌కు రాజకీయం నేర్పేందుకు కొన్ని ఛానళ్లు క్లాసులు ఇస్తున్నాయని, కేవలం కాంగ్రెస్‌ను గెలిపించడానికే ఈ నిర్నయం తీసుకున్నారని చెప్పారు. చచ్చిపోయిన పీనుగులాంటి పార్టీ కాంగ్రెస్ అని, 12 వేల ఓట్లతో గెలిచిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకుంటే అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. జర్నలిజాన్ని జెన్యూన్‌గా నిర్వహించాలని సూచించారు. తనకు, బండి సంజయ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసిన వారిని, అవినీతి చేసిన వారిని బొక్కలో వేస్తామని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైల్ ఆల్ టైం హై రికార్డ్..