MP Arvind: తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విమర్శలు చేస్తే దాడులు చేస్తారా? అంటూ మండిపడ్డారు. నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటిపై దాడి చేసి మా అమ్మను, మహిళలను భయపెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుందా? అంటూ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. దమ్ముంటే రా పోటీ చేయ్ అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తో కవిత మాట్లాడినట్లు సీనియర్ నాయకుడు చెప్పారని ఆరోపించారు. మీ అయ్య చెప్పినట్లు నేను మాట్లాడినా అంతే మరి మీ అయ్యను కొట్టినావా మరి అని ప్రశ్నించారు. మీ అయ్యను చెప్పుతోటి కొట్టినావా అంటూ సంచళన వ్యాక్యలు చేశారు. వీరికి కులం అహంకారం ఎక్కువైందని మండిపడ్డారు. నానేమీ ఫోన్ చేయలేదు.. నాకే ఫోన్ కాల్ చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఏ చెప్పారు అదే నాకు తెలిసింది అదే చెప్పానా అని మీడియా ముందుకు అరవింద్ చెప్పారు. నిన్ను మా తల్లిని అటాక్ చేసే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. మీ అయ్య ఇచ్చిండా అని ప్రశ్నించారు. ఇంతగా రియాక్టయ్యారంటే అందులో నిజమున్నట్టే కదా అని అరవింద్ అన్నారు. దాడులతో ఎవర్ని బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. ఇది కేవలం కుల అహంకారం అని చెప్పుకొచ్చారు. ఇంట్లో కుర్చీలు, దేవుని పటాలు, మహిళలను బెదిరించి ఇలా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
Read also: Bandi Sanjay: రౌడీయిజం చేస్తారా? మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు
ఇవాళ ఎంపీ అరవింద్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటిలో చొరబడ్డారు. ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముందు జిస్టి బొమ్మను దగబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంటి గేటును మూసి వేసిన గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. వారిని పోలీసులు పట్టికుని కిందికి దించారు. ఎమ్మెల్సీ కవితపై అనుచుత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు. దీంతో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నెలకొంది. టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.