Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..
- కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు భక్తుల సందడి..
- ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో మారుమ్రోగిన ఆలయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఆలయ అర్చకులు శివునికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
Read also: Telangana TET Notification: నేడు టెట్ నోటిఫికేషన్… జాబ్ కేలండర్ ప్రకారం నిర్వహణ..
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
రాష్ట్రంలోని వేములవాడ, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి గోపూజ, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భద్రాచలం వద్ద భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు
కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. తెల్లవారుజామునుండే స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. రాజన్న ఆలయం ముందు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆది దంపతుల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నది స్నానానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీతో గోదావరి నది తీరాన స్నాన ఘట్టాలు కోలాహలంగా మారాయి. స్నానాల అనంతరం గోదావరి నదిలో పుణ్యదీపాలు వెలిగించి నీటిలో వదిలిన అనంతరం దర్శనానికి శివాలయానికి చేరుకుంటున్న భక్తులు.
Read also: Astrology: నవంబర్ 04, సోమవారం దినఫలాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల సందడి వాతావరణం కనిపించింది. త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు.. గోదావరిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు,ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తున్నారు. ఉసిరిచెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షణలు చేస్తున్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
తాజావార్తలు
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!