Hussain Sagar : మూసీ, హుస్సేన్ సాగర్‌లలో తగ్గుతున్న కాలుష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలు తమ నదులలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలతో పోరాడుతున్న తరుణంలో, హైదరాబాద్ నగరంలోని రెండు ప్రధాన నీటి వనరులైన మూసీ, హుస్సేన్ సాగర్ నదులు కాలుష్యం నుంచి బయటపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా మూసీ నది, హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత చాలా మెరుగుపడిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (TSPCB), హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (HMWSSB) సహా అనేక అధికారులు ఈ నీటి వనరులలో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి కలిసి పనిచేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోయేటప్పుడు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణాన్ని సూచించే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) స్థాయి మూసీలో పడిపోయింది. 2014లో BOD 58 mg/L ఉండగా, 2020లో అదే 22 mg/Lగా నమోదైంది.
నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఏదైనా నీటి వనరుల నాణ్యతకు దోహదపడే అతి పెద్ద కారకాలలో ఒకటి వర్షపాతం. “హైదరాబాద్‌లో కొన్ని మంచి రుతుపవనాలు ఉన్నాయి. ఫలితంగా మూసీ, హుస్సేన్ సాగర్‌లలో నీటి మెరుగుదల ఏర్పడింది. మరొక అంశం ఏమిటంటే, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌పీసీబీ, హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బీలు తమ నీటి వనరులలోకి ప్రవేశించే మురుగునీటిని మొదట శుద్ధి చేసేలా నిరంతరం కృషి చేయడం. అధికారులు పూడిక తీసి ఘన వ్యర్థాలను తరలించి అందులో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకున్నారు. ఇంతకుముందు 10 నుంచి 20 శాతం మురుగునీటిని మాత్రమే శుద్ధి చేసేవారు. అది ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 శాతానికి చేరుకుంది’ అని ఆయన చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..