Site icon NTV Telugu

Praja Sangrama Yatra: 6వ రోజు బండి సంజయ్ పాదయాత్ర.. ఇవాళ సిర్గా పూర్ వరకు..

Bandisanjay Nirmal

Bandisanjay Nirmal

Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రవ్యాప్తంగా పలు దఫాలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతోంది. ఇప్పటికే నాలుగు దశలు పూర్తి చేసుకున్న ఆయన… తాజాగా ఐదో దశ ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో.. ఇవాళ నిర్మల్ జిల్లాలో 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది. గుండంపల్లి క్రాస్ రోడ్స్ , దిల్వార్ పూర్, లోలం మీదుగా సిర్గా పూర్ వరకు ఈయాత్ర సాగనుంది. ప్రజల సమస్యలు వారితో మమేకమై బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్‌ పాదయాత్రతో బీజేపీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది.

Read also: Thunivu: అప్డేట్ కోసం అరాచకాలు చేస్తున్నారు…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించేందుకు బండి సంజయ్‌ ఇప్పటి వరకు నాలుగు దశల పాదయాత్ర పూర్తి చేశారు. 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 21 జిల్లాల్లో 1100 కి.మీ. మీటర్ల కంటే ఎక్కువ నడిచారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ కూడా ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


Delhi: మరో లివ్ ఇన్ రిలేషన్ కేసు..శ్రద్ధా తరహాలో మహిళ హత్య..

Exit mobile version