Dasyam Vinay Bhasker: బీజేపీది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర అని చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ది అహంకార యాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రతో సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, బండి సంజయ్ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని అన్నారు. బీజేపీది పాద యాత్ర కాదు కుట్రల యాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరని అన్నారు. కేంద్రం, బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెలిపారు. ఈడీ, ఐటీ దాడులతో కేసీఆర్ కుటుంబం సహా, మంత్రులను బీజేపీ వేధిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నాయకుల కుట్రలను తిప్పికొడతామన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని స్పష్టం చేశారు.
Read also: Fifa World Cup: మొరాకో విజయాన్ని జీర్ణించుకోలేక.. అల్లర్లు సృష్టించిన ఫ్యాన్స్
నవంబర్ 29న ఉద్యమాల గడ్డ వరంగల్ లో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 29న దీక్ష దివస్ తోనే తెలంగాణ వచ్చిందని ప్రజల నమ్మకమన్నారు. తెలంగాణ వ్యతిరేక జాతీయ పార్టీలను తెలంగాణ నినాదం ఎత్తుకునేల చేసిన ఘనత కేసీఆర్ ది అని, నవంబర్ 29నుంచి డిసెంబర్ 9వరకు 11రోజులు దీక్ష దివస్ కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కుట్రలతో బీజేపీ కూలుస్తోందని మండిపడ్డారు. ప్రజలను రెచ్చ గొట్టే యాత్రను చేయటం బండి సంజయ్ మానుకోవాలని హెచ్చరించారు. బండి సంజయ్ కి దమ్ముంటే విభజన చట్టం హామీలు నెరవేర్చాలని పాదయాత్ర చేయాలని అన్నారు. మమ్ములను కులాదోయాలని చూస్తే జైలు పాలు అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళోజి సెంటర్ లో నవంబర్ 29న పెద్ద ఎత్తున దీక్ష దివస్ కార్యక్రమం చేస్తున్నామని, 30న ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ నుండి క్యాండిల్ ర్యాలీ చేస్తామని తెలిపారు.
Read also: Jogi Ramesh : అభినవ మహాత్మా జ్యోతిరావు పూలే వైఎస్ జగన్
దీక్ష దివస్ కార్యక్రమాల షెడ్యూల్..
డిసెంబర్ 1న బైక్ ర్యాలీ.
డిసెంబర్ 2న పబ్లిక్ గార్డెన్ లో ఫోటో ఎగ్జిబిషన్.
డిసెంబర్ 3న అమరవీరుల సభ.
డిసెంబర్ 4న కాజిపేట్ లో ఆట పాటలతో ధూమ్ ధాం.
డిసెంబర్ 5న ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్ట్ ల ఆత్మీయ సమ్మేళనం.
డిసెంబర్ 6న అంబేద్కర్ ఆలోచన – కెసిఆర్ ఆచరణ సెమినార్.
డిసెంబర్ 7న విద్యార్థుల అలయ్ బలయ్.
డిసెంబర్ 8న అన్ని డివిజన్ లలో తెరాస జెండా ఎగరవేత, టీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం.
డిసెంబర్ 9న పునరంకింత సభ ఉంటుందని చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు.
Dhananjaya: దేవరకొండలో ఏం జరిగింది!?