వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మనం ఏం చేయబోయేది తెలియచేద్దాం. దేశంలో ప్రగతి పథంలో నడిపించింది కాంగ్రెస్. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రైతునే రాజుగా చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ అందించాం. ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. రైతులకు రుణమాఫీ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కింది.
రైతుల సబ్సిడీలు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేక పోతున్నారు. 1960 రూపాయల ఎంఎస్ పీ ధర వుంటే 13, 14 వందలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులకు ఎలా సాయం చేయాలి? రైతులందరి సంక్షేమం కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మనం సిద్ధంగా వుండాలన్నారు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. సోనియా గాంధీ నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువద్దామన్నారు.