Site icon NTV Telugu

డీఎస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీరే చూస్తారు..!

D Srinivas

D Srinivas

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్‌ పొలిటిషన్‌, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్‌ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు.. ఆయన కుమారుడు ఒకరు బీజేపీ నుంచి ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తుండగా.. మరొకరు కాంగ్రెస్‌ పార్టీలో కీలక భూమిక పోషించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. టీఆర్ఎస్‌కు కూడా దూరమైన డీఎస్‌.. తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎస్‌.. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నా కొడుకులు నాకు రెండు కళ్లు… ఏ పార్టీలో ఉన్నా.. సమాజ సేవలో ఉండాలనే కోరుకుంటున్నా అన్నారు. నా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటోందో త్వరలో మీరే చూస్తారన్న ఆయన.. కూర్చొని చక్రం తిప్పగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చారని.. నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదని వ్యాఖ్యానించారు డీఎస్.

Exit mobile version