NTV Telugu Site icon

Nagarkurnool: రూ.21.47 కోట్ల కరెంట్‌ బిల్లు.. ఆ.. అవాక్కయ్యారా..

Nagar Karnool

Nagar Karnool

Nagarkurnool: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనుంది. ఈ పథకం గత నాలుగు నెలలుగా అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పేదల ఇళ్లల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ బిల్లు వందలు, లక్షలు కాదు కోట్లలో వచ్చింది. దీంతో ఇంటి యజమానికి గుండె ఆగివనంత పనైంది. ఈ వింత ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది.

Read also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్ కు చెందిన వేమారెడ్డికి ప్రతినెలా వందల రూపాయల బిల్లు వచ్చేది. ఈ క్రమంలో ఈ నెల 7న విద్యుత్ అధికారులు వేమారెడ్డి ఇంట్లో కరెంట్ మీటర్ ను స్కాన్ చేసి రూ.21,47,48,569 చెల్లించాలని బిల్లు ఇచ్చారు. బిల్లు ఆలస్యంగా చూసిన వేమారెడ్డికి షాక్ తగిలింది. సాధారణంగా వందరూపాయల్లో రావాల్సిన బిల్లు రూ.కోట్లలో వస్తోందని ఆందోళన చెందడంతో విద్యుత్ శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఏఈ మహేశ్ ను వివరణ కోరగా జీరో బిల్లింగ్ సమయంలో ఇలా జరిగిందని తెలిపారు.

Read also: Tragedy: విషాదం.. కాలకృత్యాలకు వెళ్లిన అక్కాచెల్లెళ్లను పలకరించిన అకాలమృత్యువు

లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌లు అవగాహన లేని బయటి వ్యక్తులతో కరెంటు బిల్లులు ఇస్తున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రతి పనిని ప్రైవేట్ వ్యక్తులే చేయడంతో వారికి అవగాహన లేకపోవడంతో కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతోంది. దీనిపై ఏఈ మహేశ్‌ను వివరణ కోరగా.. సాంకేతిక లోపంతో బిల్లులు ఎక్కువగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. కొనుగోలు ఫిర్యాదు మేరకు వెంటనే బిల్లులు సరిచేశామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకం కింద జీరో బిల్లును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 200 యూనిట్లలోపు కరెంట్ వాడితే జీరో బిల్లు నడుస్తోంది. అయితే అందుకు భిన్నంగా లక్షలు, కోట్ల రూపాయల్లో బిల్లులు రావడంతో కొందరు అయోమయానికి గురవుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి.
Crime News: మదనపల్లెలో దారుణం.. తండ్రిని హత్య చేసిన కూతురు!