భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు భారీవర్ష సూచన నేపథ్యంలో.. 5 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమేశ్‌కుమార్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించిందని, భద్రాచలం దగ్గర గోదావరి రేపటికి 70 అడుగులకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందర్నీ ఖాళీ చేయించాలన్నారు. వరదబాధితులను సహాయక కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్రధాన రహదారి, బ్రిడ్జి ని పూర్తిగా తమ అధీనం లోకి తీసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ రోహిత్ వెల్లడించారు.
ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరిని పంపించటం లేదని స్పష్టం చేశారు. రాత్రికి సుమారుగా 70 అడుగుల వరకు వరద ఉధృతి పెరుగుతుంది అని అంచనా వేశారు. ఎట్టి పరిస్థితులలో ఎవరు ప్రయాణాలు పెట్టుకోవద్దని, బయటికి రావొద్దని ఆయన ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించమని ఆయన వెల్లడించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో పర్య వేక్షిస్తున్నామని, ప్రజలు ఎవరు భయబ్రాంతులకు గురి కావొద్దని ఆయన వెల్లడించారు.