Site icon NTV Telugu

టీజీఓ, టీఎన్‌జీఓ ఉద్యోగులతో సీఎస్‌ సమావేశం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో TGO మరియు TNGO ఎంప్లాయీస్ యూనియన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారిగా వివిధ శాఖలు వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు పై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు స్థానిక కేడర్‌ల వారిగా పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుపై TGO, TNGO సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులందరికీ క్యాడర్‌ల వారిగా ఆప్షన్స్‌ ఇచ్చి కేటాయింపులు కల్పిస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు.


ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. TGO, TNGO లతో పాటు ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన జిల్లా స్థాయి ఉద్యోగుల సంఘాలను కూడా కేటాయింపు సమయంలో ఆహ్వానిస్తామని సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో లేని జిల్లాల్లో మొదటి దశలో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను త్వరలో చేపడతామన్నారు. మిగిలిన జిల్లాల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఎత్తివేసిన తర్వాత ఈ ప్రక్రియను చేపడతామని సీఎస్‌ సోమేష్ కుమార్ తెలిపారు.

Exit mobile version