Vemulawada: విజయదశమి రోజు భద్రకాళి అమ్మవారు ఆలయంలో వాహన పూజలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఒక్కరోజు లక్షకు పైగా వాహనాలకు పూజలు జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. భద్రకాళి ఆలయంలో సొంత వాహనాలతో పాటు అధికార వాహనాలు వ్యాపార వాహనాలకు పూజలు జరుగుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా విజయదశమి పర్వదినం పురస్కరించుకొని రాజరాజేశ్వరి దేవి అమ్మవారు మహాలక్ష్మి రాజరాజేశ్వరీ దేవి అవతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహర్నవమి విజయదశమి సందర్భంగా ఉదయం స్థానాచార్యులు అప్పాల బీమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి చతుషష్టి పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపం, చండీ హోమం, పూర్ణాహుతి ,గాయత్రి హవనాన్ని వేదమంత్రాలతో నిర్వహించారు. మహార్నవమి సందర్భంగా ఉదయం రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి అర్చక సువాసినిలచే మహాభ్యంగనం, అనంతరం ఆయుధ పూజ, బలిహరణ పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం అంబరీ సేవపై పట్టణ పురవీధుల గుండా పెద్ద సేవలో ఉత్సవమూర్తులను ప్రతిష్టించి, పూజలు చేసిన తర్వాత ఊరేగింపు జరుగుతుంది.
వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా భద్రకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చిన భద్రకాళి అమ్మవారు విజయదశమి రోజు నిజరూపలో దర్శనం ఇస్తున్నారు.. విజయ దశమి రోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి అనే నమ్మకంతో వరంగల్ జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో భద్రకాళి ఆలయం మొత్తం భక్తులతో నిండిపోయింది.. ప్రత్యేక క్యు లైన్స్ ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారు భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు
MP Rammohan Naidu: సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం..