NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదు

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్.. మోడీ కాదని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని వారు ఆ పాత్రను హైజాక్ చేయాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణా ప్రస్తావన అంటేనే కమ్యూనిష్టులని, వారులేకుంటే తెలంగాణే లేదని గుర్తు చేశారు. త్యాగం ఒకరిది భోగం ఒకరిదని మండిపడ్డారు. సాయుధ పోరాటంలో చనిపోయినవారిలో పార్టీలకు సంబంధించిన వారున్నారా? అని ప్రశ్నించారు. మతం పేరుతో మతం పిచ్చి తో ప్రజలను విచిన్నం చేయాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళని విమర్శించారు. నల్ల మట్టి ఎర్రమట్టి అయింది కంమ్యూనిష్టుల రక్తం తోనేఅని గుర్తు చేశారు.

Read also: Ushashri Charan : వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ?

ఏ పాత్ర లేని వాళ్ళు బండిక్రింది కుక్కల వ్యవహరిస్తున్నారన్నారు. చరిత్ర చరిత్రగానే ఉంచండి.. వక్రీకరించకండని మండిపడ్డారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విమోచనమే అని అన్నారు. తెలంగాణ కమ్యూనిస్తూ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టుల చరిత్రను గుర్తించాల్సింది కేసీఆర్ తప్ప మోడీ కాదని అన్నారు. గాడి తప్పిన కమ్యూనిస్టులను ఒకే మార్గం లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తప్పని పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం. తప్పుపట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికీ ఎప్పటికీ కమ్యూనిష్టులు పేదల పక్షాన అని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని అన్నారు. కమలం మంచిదే కానీ, బీజేపీ కమలం కరోన కంటే ప్రమాదమని ఎద్దేవ చేశారు. కమ్యూనిష్టుల అసెంబ్లీ ప్రవేశం ఉంటుందని, జర్నలిష్టుల సమస్యపై నా గొంతు వినిపిస్తా అని అన్నారు. నేను ఒకప్పుడు జర్నలిష్ఠునే, మీ సమస్యలు నాకు తెలుసని కూనంనేని సాంబశివరావు అన్నారు.
Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..