తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై ఇప్పుడు భిన్నవాదనలు తెరపైకి వస్తున్నాయి.. విలీనం అని ఓ వైపు.. విమోచనం అని మరోవైపు.. తమ వాదనలు వినిపిస్తున్నారు రాజకీయ నేతలు.. అయితే, వారి ప్రయోజనాల కోసం సాయుధ పోరాటాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కమ్యూనిస్టు నేతలు మండిపడుతున్నారు.. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి.. రైతు సాయుధ పోరాటానికి నాంది పలికింది కమ్యూనిస్టులు.. రజాకార్లతో పోరాడింది కమ్యూనిస్టులు.. చారితాత్మక నేపథ్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీకి, ఆ పార్టీ నేతలకు చరిత్ర తెలియదని మండిపడ్డ ఆయన.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి తేలేదని స్పష్టం చేశారు.
Read Also: Renu Desai: పవన్ రెండో భార్య రెండో పెళ్లి..?
ఇక, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి తెలంగాణ రైతు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు చాడ వెంకట్‌రెడ్డి.. జాతీయ సమైక్య దినోత్సవాలు కాదు నిర్వహించేది .. దీనిని లెఫ్ట్ పార్టీలు అంగీకరించబోవని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.. కాగా, కమ్యూనిస్టు నేతలకు, సీపీఐ నేత రాజాకు రష్యా అద్దాలు మారిస్తే దేశ అభవృద్ధి కనిపిస్తుందని బీజేపీ నేత తరుణ్ చుగ్ సెటైర్లు వేశారు.. వామపక్షాల అవశేషాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి.. మునుగోడులో బీజేపీ మంచి మెజార్టీ తో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ ప్రకటించలేదు… కవిత నా అభ్యర్థి ? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. తెలంగాణలో ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.. ఇక. ఎంఐఎం కబంధ హస్తాల్లో టీఆర్ఎస్ ఉంది… అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి భయపడుతుంది… విమోచనం అని కూడా ఉచ్చరించ లేక పోతున్నారు… టీఆర్ఎస్ పార్టీ రజాకర్ల లాగా మారిందని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.