వారు హుజురాబాద్ విడిచివెళ్లాలి.. లేకుంటే కఠిన చర్యలే : సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా, ఇప్పటివరకు వేర్వేరు సందర్భాలలో రూ. 3,29,36,830 నగదును పట్టుకున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు రూ. 6,36,052 విలువగల 944 లీటర్ల మద్యం, రూ. 69,750 రూపాయల విలువగల 11.4 కేజి లు గంజాయి, రూ.44,040 రూపాయలు విలువగల పేలుడు పదార్థాలను, రూ. 2,21,000 విలువగల చీరలు, చొక్కాలను, రూ. 10,60,000 రూపాయలు విలువగల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు అల్లరి సృష్టించే 2,284 మంది వ్యక్తులను గుర్తించి తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు. బైండోవర్ నియమావళి ఉల్లంఘించి మళ్ళీ నేరానికి పాల్పడిన ఎల్కపల్లి సంపత్ అనే వ్యక్తిని ఉల్లంఘన నేరం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద వివిధ పార్టీల పై 116 కేసులు నమోదు చేయడం జరిగిందని, ఈ రోజు రాత్రి 07 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిందని తెలిపారు. కావున కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ప్రచార గడువు ముగిసిన తరువాత స్థానికేతర వ్యక్తులు ఆ నియోజకవర్గం ను వదిలి వెళ్ళిపోవాలని.. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి రాత్రి 7 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు గల 72 గంటలు కాలాన్ని నిశ్శబ్ద కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం విధించిందన్నారు. ఇద్దరు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 65 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 2000 మంది పోలీస్ సిబ్బంది తో పాటు 22 కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!