Site icon NTV Telugu

తెలంగాణ మంత్రికి కరోనా

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే పలవురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా, రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డికి తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి జగదీష్‌ రెడ్డి. కాగా, భారత్‌లో పాటు.. తెలంగాణలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో.. సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు కరోనా బారిన పడి పూర్తిస్థాయిలో కోలుకున్న విషయం తెలిసిందే.

Read Also: యూఎస్‌లో కరోనా ఉగ్రరూపం.. ప్రతీ సెకన్‌కు 9 పాజిటివ్‌ కేసులు..!

Exit mobile version