యూఎస్‌లో కరోనా ఉగ్రరూపం.. ప్రతీ సెకన్‌కు 9 పాజిటివ్‌ కేసులు..!

అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి భయపెడుతోంది.. కోవిడ్‌ ఉగ్రరూపం దాల్చి పంజా విసురుతోంది.. యునైటెడ్ స్టేట్స్ సోమవారం కనీసం 1.13 మిలియన్ కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నమోదయ్యాయి.. గతంలో 1.03 పాజిటివ్‌ కేసులే అత్యధికగా రికార్డుగా ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్ధలు కొడుతూ.. ఏకంగా ఒకేరోజు 1.13 కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది.. ఓవైపు కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మందగించిందనే సంకేతాలు ఉన్నా.. డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తోంది..

Read Also: మూడు కేసుల్లో దోషిగా అంగ్‌సాన్‌ సూకీ.. మరో నాలుగేళ్ల జైలు

ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 21,041,50 మందికి వైరస్​సోకింది. 4,608 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955కు చేరాయి. అమెరికాలో ఒకేరోజు 14,49,005 మందికి వైరస్​సోకింది కలకలం సృష్టిస్తోంది.. వారం రోజుల సగటును పరిశీలిస్తే.. అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇప్పటికే మహమ్మారి కారణంగా భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసింది అగ్రరాజ్యం.. మరోసారి భారీ సంఖ్యలో కేసులు ఓవైపు.. మరణాలు మరోవైపు భయపెడుతూనే ఉన్నాయి.

Related Articles

Latest Articles