Mumbai Indians become first team to achieve 150 wins in T20 cricket: ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150వ విజయంను నమోదు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబై.. ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్(148) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా (144) మూడో స్థానములో ఉంది. లంకషైర్ (143), నాటింగ్‌హమ్‌షైర్ (143) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌లో ఒకే వేదికగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో ముంబై 50 విజయాలు నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 48 విజయాలు, చెపాక్ మైదానంలో సీఎస్‌కే 47 విజయాలు, చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీ 41 విజయాలు, సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ 36 విజయాలు నమోదు చేశాయి.
Also Read: Ravi Bishnoi Catch: రవి బిష్ణోయ్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్.. చూస్తే మతిపోవాల్సిందే!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 14 సార్లు 200లకు పైగా రన్స్ చేసింది. 200 ప్లస్ రన్స్ చేసిన ఏ మ్యాచ్‌లోనూ ముంబై ఓడిపోలేదు. 200 ప్లస్ రన్స్ చేసి ఓడిన జట్లు ఐపీఎల్‌లో చాలానే ఉన్నాయి. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా.. 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టీ20 టీమ్ సోమర్‌సెట్ రికార్డును అధిగమించింది. 2018లో సోమర్‌సెట్ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకుండా 226 పరుగులు చేసింది.