హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఆమ్నిషాయా పబ్ రేప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల డీఎన్‌ఏ సేకరణను అనుమతి ఇచ్చింది కోర్టు.. బాలికపై గ్యాంగ్ రేపు కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. నిందితుల డీఎన్‌ఏ సేకరణ కోఎసం అనుమతికోరుతూ కోర్టును ఆశ్రయించగా.. డీఎన్‌ఏ సేకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.. దీంతో, నిందితుల నుంచి డీఎన్‌ఏ సేకరించనున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు పోలీసులు… డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు పోలీసులు..
Read Also: YSRCP: అధికార పార్టీలో ఉన్న ఆ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి గిట్టదా..?
ఇక, ఈ కేసు విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్ గా డీఎన్‌ఏ రిపోర్ట్ కీలకంగా మారనుంది.. అవసరమైతే బాధితురాలి డీఎన్‌ఏను కూడా సేకరించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ ఘటనపై కోర్టులో బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.. నిందితుల పాస్‌పోర్ట్‌లను సైతం సీజ్ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.. నిందితులకు బెయిల్ లభిస్తే దేశం వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురి బెయిల్ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. కాగా, మే 28వ తేదీన మైనర్ బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం మైనర్లు జువైనల్ హోంలో.. సాదుద్దీన్ చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.