Site icon NTV Telugu

Revanth Reddy: అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ నేతలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. పోడు భూములు, పోడు భూములపై ​​కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ సోమేశ్‌ కుమార్‌తో కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. అనంతరం పలు డిమాండ్‌ లతో వున్న మెమోరండంను సోమేశ్‌ కుమార్‌ కు అందజేశారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నిషేదిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అసైన్డ్ భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read also: Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా

కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతారని, రైతు సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టాలని పార్టీ యోచిస్తోందని తెలిపారు. అలాగే, పార్టీ నేతలు గవర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో.. సీఎల్పి నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లు జగ్గారెడ్డి, సీతక్క, వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, కిసాన్ కాంగ్రేస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రాములు నాయక్ లు పాల్గొన్నారు.
Botsa Satyanarayana: చంద్రబాబు సహనం కోల్పోయారు

Exit mobile version