Municipal Elections : 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా
- 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
- పలుచోట్ల క్లీన్ స్వీప్
- మెదక్ జిల్లాలో భారీ ఆధిక్యం
- నర్సాపూర్‌లో హోరాహోరీ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో ‘హస్తం’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 90 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ధీమాగా ఉన్న కాంగ్రెస్ నేతలు, తాము ఆశించిన 85-90 స్థానాల లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read
ఈ ఎన్నికల్లో అనేక చోట్ల ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ముఖ్యంగా ధర్మపురి, కోస్గి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. నందికొండ, చిట్యాల, భీంగల్, మరిపెడ, దోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ వంటి ప్రధాన మున్సిపాలిటీలు ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలోకి చేరాయి. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ తన జోరును ప్రదర్శించింది. మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం వంటి ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో స్థానిక సంస్థలపై కాంగ్రెస్ పూర్తిస్థాయి పట్టు సాధించినట్లయ్యింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఫలితాలను సాధించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 20కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా, సదాశివపేటలో 26 వార్డుల్లో 16 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహాలు ఇక్కడ అద్భుతంగా ఫలించాయి. ఇక్కడ ఎంఐఎం (MIM) పార్టీ కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితం కావడం గమనార్హం. అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గమైన జోగిపేటలో 20 వార్డులకు గాను 16 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి తన పట్టును నిరూపించుకుంది. ఇక నర్సాపూర్‌లో మాత్రం ఫలితాలు ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగగా, ఒక వార్డులో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఫలితంగా అక్కడ హంగ్ ఏర్పడింది.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!