Site icon NTV Telugu

Congress Strategy: మున్సిపల్ పోరుకు కాంగ్రెస్ సన్నద్ధం.. అభ్యర్థుల ఎంపికపై భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు!

Bhatti Vikramarka

Bhatti Vikramarka

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అనేది కేవలం ఒకరిద్దరి నిర్ణయం కాకూడదని, అత్యంత పారదర్శకంగా , సమిష్టిగా సాగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆయా మున్సిపాలిటీల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , సీనియర్ నాయకులు అందరూ కలిసి చర్చించి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో అందరినీ కలుపుకుని పోవడం వల్ల పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా ఉంటాయని, ఇది ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీ మండల , పట్టణ స్థాయి నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు.

Actor Harsha: 100 మందికి పైగా అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి భట్టి విక్రమార్క కొన్ని కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. కేవలం రాజకీయ ప్రాధాన్యతలకు కాకుండా, క్షేత్రస్థాయిలో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అభ్యర్థులపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న ‘ఆరు గ్యారెంటీలు’ , ఇతర అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించి, వారి మద్దతు పొందే నాయకులను గుర్తించడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలమని ఆయన పునరుద్ఘాటించారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు , మున్సిపాలిటీ బాధ్యులు తదేక దృష్టితో పనిచేసి, ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల్లో పార్టీ జెండా ఎగిరేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజయాలను ఆయుధంగా మలచుకుని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులను ఆయన ఉత్సాహపరిచారు.

AP Cabinet Key Decisions: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ కేబినెట్..

Exit mobile version