Site icon NTV Telugu

Congress Party: తెలంగాణ కాంగ్రెస్ పై రాహుల్ ఫోకస్

రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది.

ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర సీనియర్ నాయకులు ఢిల్లీ వెళ్ళారు. అన్ని గ్రూపులను రాహుల్ తో సమావేశానికి పిలిచింది అధిష్టానం. పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాల పై ప్రధాన చర్చ జరుగుతుందని భావిస్తున్నారు.

రేవంత్ ను విభేదిస్తున్న జగ్గారెడ్డి, వీహెచ్ లకు ఆహ్వానం అందడంతో సమావేశం వాడివేడిగా జరుగుతుందని అంటున్నారు. సమావేశంలో రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీచేస్తానంటున్నారు. కామారెడ్డి నుంచి ఆయన పోటీచేసే అవకాశం వుంది. అటు మహేష్ గౌడ్ కూడా ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపిస్తున్నారు.

Exit mobile version