Jaggareddy: నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. బీజేపీ..టీఆర్‌ఎస్ రాజకీయ పార్టీలుగా కాకుండా కార్పొరేటర్ వ్యవస్థగా పమి చేస్తున్నాయని ఆరోపించారు. మోడీ ఈ ఎనిమిది ఏండ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేవు.. పెట్రో ధరలు పెరిగాయి.. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు దిక్కు లేదని ఆరోపించారు. లక్ష రుణమాఫీ లేదు, 57 ఏండ్ల వాళ్లకు పెన్షన్ అన్నారు అది లేదని అన్నారు. బీజేపీ..టీఆర్‌ఎస్ మీడియా ఎట్రాక్ట్ ఎలా చేయాలని చూస్తున్నారని అన్నారు. మీడియా ని డైవర్ట్ చేయడం ఎలా అనే దానిలోని ఉన్నాయని ఆరోపించారు.
Read also: Safest investment Plan: సురక్షితమైన పెట్టుబడికి సరైన మార్గం విజయవాడ హైవే
బీజేపీ..టీఆర్‌ఎస్ ఇద్దరు హోంశాఖను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపనీ నడిపిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఇద్దరు ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. రెండు పార్టీలు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నారా అంటే అది లేదన్నారు. చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి బీజేపీ..టీఆర్ఎస్ పార్టీలని అన్నారు. విభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు అని ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్‌ఎస్.. బీజేపీలు అంటూ నిప్పులు చెరిగారు. రైతుల సంగతి అడిగే వాళ్ళే లేరని అన్నారు. ఒకరిని ఒకరు గిచ్చుకుంటున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ..టీఆర్ఎస్ తిట్టుకునుడు.. కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి..? అని ప్రశ్నించారు. సొంత పంచాయతీలు రెక్కువ అయ్యాయి.. రెండు పార్టీలకు అంటూమండిపడ్డారు. బీజేపీ..టీఆర్‌ఎస్ పంచాయతీలు చూస్తే చాలు.. సినిమాలు చూడాల్సిన అవసరం లేదన్నారు. కవిత..అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా? విద్యార్థల కోసం కొట్లాడుతున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వదిలేసి.. సొంత దుకాణాలు పెట్టారని ఎద్దేవ చేశారు.
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
