NTV Telugu Site icon

Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..

Beerla Ilaiah

Beerla Ilaiah

Beerla Ilaiah: తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. గొల్లకుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కూడా కలిశానని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయని.. ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరూ కూడా మంత్రులుగా లేరని.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నానని బీర్ల ఐలయ్య చెప్పారు.

Read Also: Minister Seethakka: సహించేది లేదు.. సోషల్ మీడియా ఘ‌ట‌న‌పై మంత్రి సీత‌క్క ఆగ్రహం

ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా గొల్ల కుర్మలకు ప్రతినిధిగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. మొదటి సారిగా గొల్లకుర్మలకు మంత్రి వర్గంలో ఎవరూ లేరని ఆయన వెల్లడించారు. ఆంధ్రలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని.. ఇక్కడ కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్ పోస్ట్, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు సీఎం పీఆర్ఓ పోస్టులు కావాలన్నారు. 50 లక్షల పైచిలుకు జనాభా ఉన్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని బీర్ల ఐలయ్య చెప్పుకొచ్చారు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు కూడా వస్తున్నాయన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందని.. సీఎంపై నమ్మకం ఉందని బీర్ల ఐలయ్య అన్నారు.