NTV Telugu Site icon

కేసీఆర్‌ నిజంగా అవినీతి చేస్తే బయటపెట్టరే..! ఇదో డ్రామానా..?

మరోసారి టీఆర్ఎస్‌, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు.

Read Also: కోవిడ్‌ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..!

ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టిన వి. హనుమంతరావు… సీఎం కేసీఆర్‌ని జైల్లో పెడతా అని చెప్పిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే జైల్లో పెట్టారు అంటూ ఎద్దేవా చేశారు.. కేసీఆర్‌ను జైల్లో పెడతా అని బీజేపీ చెప్పడమెనా..? లేక ఇద్దరు డ్రామాలు అడటమేనా..? అని నిలదీశారు.. కేసీఆర్‌ నిజంగానే అవినీతి చేస్తే.. ఎందుకు బయట పెట్టడం లేదని ఫైర్‌ అయ్యారు.. గతంలో అవినీతి చేసినవాళ్లు బీజేపీలో చేరగానే అవినీతి ఆగిపోయిందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీహెచ్‌.